ఉరుకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నా ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి

ఉరుకొండ: ఉరుకొండ మండలంలోని పలు కార్యక్రమాలలో గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు Dr. సి. లక్ష్మా రెడ్డి గారు పాల్గొన్నారు. ముందుగా ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల సంరక్షణ కోసం ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉరుకొండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు లేవనెత్తిన పలు ప్రజా సమస్యలపై సంబంధింత శాఖ అధికారులతో చర్చించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు లేవనెత్తిన ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరింపచేయలని మండల అధికారులకు సూచించారు. అనంతరం ఉరుకొండ మండలంలో బావాజితండా, గుండ్లగుంటపల్లి గ్రామాలకు చెందిన (2) ఇద్దరికి అంగన్ వాడి మినీ టీచర్, ఆయా పోస్టుల భర్తీలో భాగంగా వారికి నియామక పత్రాలను ఎమ్మెల్యే Dr. సి. లక్ష్మా రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.