ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్: ఈ రోజు ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 53 మందిని పరీక్షించగా అందులో 20 మందికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని, అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించ బడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని బీజేపీ నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.ఆడెపు దేవేందర్ ప్రజనేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.