ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ గ్రాండ్ సక్సెస్….నెరవేరిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యం

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం దళిత బంద్ పేరుతో దళితులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుండగా అందుకు కౌంటర్ గా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన ఆత్మగౌరవ నినాదాన్ని ముందు పెట్టి దళితులు గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.క్విట్ ఇండియా దినోత్సవం రోజున ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినం అయిన సెప్టెంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేసి దళిత దళిత గిరిజనల్లో చైతన్యం తెచ్చేందుకు చేపట్టిన మొట్టమొదటి సభకు పెద్ద ఎత్తున జనం రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం ఏర్పడింది.పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దళిత గిరిజనులు గుండెలకు హత్తుకొనేలా దళిత గిరిజన వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వైఖరి కనిపించింది.తెలంగాణకు ఉత్తరం వైపు ఆదిలాబాద్ జిల్లా చారిత్రాత్మక ఇంద్రవెల్లి గడ్డపై రేవంత్ రెడ్డి మోగించిన దండోరా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో కదలిక తెచ్చినట్లు అయింది.తాను దళిత బిడ్డలం కాకపోయినా నల్లమల్ల అడవుల్లో పుట్టిన బిడ్డనని మీకు అన్నగా, కొడుకుగా, ఇంట్లో ఒక్కడిగా నా జీవితకాలం మీ కోసం పని చేస్తానని…. నా చివరి రక్తపు బొట్టు వరకు మీ కోసం పని చేశానన్న ఆనందంతో కళ్ళు మూస్తానని రేవంత్ రెడ్డి ఉద్వేగంతో చేసిన ప్రసంగం కాంగ్రెస్ పట్ల దళిత గిరిజనులకు మరింత దగ్గర చేసినట్లయింది.అంతేకాకుండా ఇది నాయకులు పార్టీ కాదని ఇక నుంచి కార్యకర్తల పార్టీ అని ఇంద్రవెల్లిలో జరిగిన సభా నాయకులు విజయం కాదని కార్యకర్తలు కృషి ఫలితమేనని, ఇక సోనియమ్మ రాజ్యమని తెలంగాణ తల్లి అంటే సోనియాగాంధీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తుపెట్టుకొని మీరు అడగకపోయిన మీ ఇంటికి వచ్చి పని చేసి పెడతామని కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ చేసిన ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో మంచి జోష్ నింపింది.40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు ఇంద్రవెల్లి అంకురార్పణ పేర్కొన్నారు.పోరాటాల గడ్డ అయిన ఇంద్రవెల్లిలో శంఖారావం పూరించడం మంచి ముహూర్తం కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది

Leave A Reply

Your email address will not be published.