ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో ఫజల్ రెహమాన్

ప్యాపిలి : కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఆర్థిక అభివృద్ధి కేంద్రాన్ని పట్టణంలోని పెద్ద పూజార్ల రోడ్డులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో ఫజల్ రెహమాన్, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్ వేదవ్యాస్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ కైసర్ భాషా, వెలుగు ఏపీఎం కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులకు సంబంధించి, మీ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల సమాచారం కోసం ఇక్కడ సంప్రదిస్తే ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా మీకు తగిన సమాచారం అందిస్తారని, వినియోగదారులు వీరి సేవలను సద్వినియోగ పరచుకోవాలి అని కోరారు. ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ఎంపీడీవో ఫజల్ రెహమాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో CFLకౌన్సిలర్లు రంగప్ప రాజు, మహీంద్ర మరియు ఆర్ సి మద్దిలేటి, సిహెచ్ బాల రంగన్న, డాక్టర్ రామచంద్రుడు, అచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.