ఆగస్టు 9 సేవ్ ఇండియా కార్యక్రమం జయప్రదం చేయాలని బైక్ యాత్ర – సి ఐ టి యు

వెల్దుర్తి మండలంలోని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బైకి యాత్ర మండల అధ్యక్షులు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ బైక్ యాత్రను సిఐటియు మండల గౌరవాధ్యక్షులు రాముడు జెండా ఊపి ప్రారంభించారు. సిఐటియు జిల్లా నాయకులు నగేష్ మండల కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కార్మికులకు హానికలిగించే కార్మిక కోడ్స్ రద్దు చేయాలని, పెంచిన నిత్యవసర వస్తువులు మరియు గ్యాస్ పెట్రోలు డీజిలు కరెంటు బిల్లులు తగ్గించాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. 9వ తేదీ వెల్దుర్తి లో జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని మండలంలోని మదర్ పురం, మంగంపల్లి సుధా పల్లి బింగిదొడ్డి బోయిన్పల్లి రామళ్లకోట కొత్తూరు, కలుగొట్ల గ్రామాలలో బైక్ యాత్ర నిర్వహించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ఉపాధ్యక్షులు మారన్న, దశరథ, మండల నాయకులు చిన్న ఏసు, రామ్ మద్దిలేటి,
హమాలి యూనియన్ నాయకులు మధు మధు శేఖర్ మద్దిలేటి సుబ్బరాయుడు మోహన్ శివ, కృష్ణ ,నాగ మద్దయ్య వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు…..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.