ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

కంబాలపాడు ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు, పాఠశాలలో ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారు అడిగారు. ప్రిన్సిపాల్ ఆప్షనల్ హాలిడే పెట్టారు అని అక్క ఉన్న టీచర్స్ చెప్పడంతో అటెండెన్స్ రిజిస్టర్ ని పరిశీలించి ఇందులో ఎందుకు రాయలేదు అని అన్నారు. అనంతరం నాడు నేడు కింద మంజూరైన పనులను విద్యా కమిటీ చైర్మన్ సంతకం లేకుండానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిధులను దుర్వినియోగం చేశారని కలెక్టర్ శ్రీ కోటేశ్వర రావు గారు,DCO ki ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.అనంతరం క్రిష్ణగిరి కేజీబీవీ,గ్రామ సచివాలయం,మండల కార్యాలయం, పశు వైద్యశాల ను పరిశీలించారు. మండల ఎంపిడిఓ, ఈవో ఆర్ డి, కార్యాలయ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పశువైద్యశాల లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తరచూ ప్రతి కార్యాలయాన్ని, స్కూళ్లను, సచివాలయం తనిఖీ చేస్తారని అందుబాటులో లేకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు తెలియజేశారు…ప్రజా.నేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.