అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మహాదేవపూర్ సి ఐ కిరణ్ కుమార్ పీ ఎస్ ఐ ప్రసన్న కుమార్, CRPF సిబ్బంది తో మహదేవ్ పూర్ మండలం, కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి లోని మెట్ పల్లి(కన్నేపల్లి) గ్రామంలో శనివారం నాకబంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ కిరణ్ కుమార్ గ్రామస్తులతో మాట్లాడుతూ కొత్త అనుమానిత వ్యక్తులు మరియు సంఘ విద్రోహక వ్యక్తులు ఎవరైనా గ్రామం లోకి వస్తె వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని వారికి సహకరించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తవారికి ఇల్లు కిరాయికి ఇస్తే వారి ఆధారాలు అన్ని తీసుకోవాలని తెలిపారు. మరియు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి నిరంతరం వారి అలవాట్ల పై నిఘా ఉంచి వారు సక్రమమైన మార్గంలో నడుచుకునే విదంగా చూసుకోవాలి మరియు విద్యార్థుల తో మాట్లాడి వారికి చదువు పై, ఆటల పై అవగాహన కల్పించారు. గ్రామస్తులకు CC కెమెరా ల గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 కి ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రం స్టాఫ్ సెలక్షన్ కమిటీ పారా మిలటరీ లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది విద్యా అర్హతలు: 10 వ తరగతి చివరి తేదీ ఆగస్టు 31 కావున ఆసక్తి ఉన్నవారు పోలీస్ స్టేషన్ కి వస్తె వారికి కాళేశ్వరం పోలీస్ తరుపున సరైన గైడెన్స్ ఇస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.