అనంతారం సర్పంచ్ నారాయణ పై డిపిఓ కు పిర్యాదు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, మండలంలోని అనంతారం గ్రామ సర్పంచ్ చల్ల నారాయణ పై గ్రామ వార్డ్ సభ్యులు ఒల్లల నర్సయ్య వేములవాడ రత్నమాల జిల్లా పంచాయతీ అధికారి కి పిర్యాదు చేసారు. గ్రామంలో ప్రతిమ కంపెనీ కి చెందిన క్రషర్ ఏర్పాటు చేయగా వారి వద్ద నుండి సర్పంచ్ నారాయణ మూడు లక్షల యాభై వేల రూపాయలు లంచంగా తీసుకుని వార్డ్ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం లేకుండా క్రషర్ అనుమతి తీర్మాణం ఇచ్చాడని పిర్యాదు లో పేర్కొన్నారు. సర్పంచ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకొని గ్రామానికి వచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు.పిర్యాదు చేసిన వారిలో వార్డ్ సభ్యులు నర్సయ్య రత్నమాల లతో పాటు ఉత్కం మల్లయ్య బొల్లం పర్శారం తదితరులు ఉన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.