వైఎస్ఆర్ కు ఉదయం చెల్లి, సాయంత్రం అన్న నివాళులు
కడప: ఇడుపులపాయలో ఇవాళ జరిగే వైఎస్.రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో సిఎం వైఎస్.జగన్, సోదరి షర్మిల వేర్వేరుగా పాల్గొంటున్నారు. రాజశేఖర రెడ్డి కి నివాళులు అర్పించేందుకు వైఎస్.విజయలక్ష్మీ, వైఎస్.షర్మిల ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్నారు.
ఇవాళ ఉదయం సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి అనంతపురం వెళ్లనున్నారు. ఇడుపులపాయలో ఉదయం షర్మిల, సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ను నివాళులు అర్పించనుండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షర్మిల ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ కు వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని షర్మిల ప్రారంభిస్తారు.
ఇవాళ ఉదయం కడప చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా అనంతపురం చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఇడుపులపాయకు చేరుకుని తండ్రి వైఎస్ఆర్ కు నివాళులు అర్పిస్తారు.