వైఎస్ కుటుంబం కాంగ్రెస్ ద్రోహులు: శైలజానాథ్
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ తెలిపారు.
వైఎస్ఆర్ పేరును అమ్ముకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసింది మీ కుటుంబ సభ్యులేనని, మీ బిడ్డల గురించి మార్కెటింగ్ చేసుకోవడం మానుకోవాలన్నారు. సోనియా గాంధీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, వైఎస్.షర్మిల కు తగిన గౌరవం ఇచ్చారని, అయినా జగన్ పార్టీ వీడి బయటకు వెళ్లాడన్నారు. మీ చర్యల వలన దివంగత వైఎస్ఆర్ ఆత్మను క్షోభకు గురి చేయవద్దని శైలజానాథ్ కోరారు.