15 రోజులు యువతి దీక్ష ఫలించింది

ఏలూరు: ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలంటూ ఒక యువతి చేసిన దీక్ష ఎట్టకేలకు ఫలించింది. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు పురోహితుడు అంగీకారం తెలపడం 15 రోజుల దీక్ష ను ముగించింది.
పాలకొల్లుకు చెందిన పూజారి శంకర శాస్త్రి, స్థానికంగా ఉండే ఒక యువతి పరస్పరం ప్రేమించుకున్నారు.

కొద్ది రోజుల నంచి పెళ్లి ఎప్పుడు అని అడిగినా సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నాడు. ఎంతకూ అంగీకరించకపోవడంతో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునేందుకు దీక్ష చేయాలని యువతి నిర్ణయించింది. రెండు వారాల పాటు అతని ఇంటి ముందు దీక్ష చేయడంతో శంకర శాస్త్రి అంగీకరించక తప్పలేదు. ప్రజా సంఘాలు, పెద్దల సమక్షంలో శంకర శాస్త్రి యువతిని పెళ్లి చేసుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.