లాక్ డౌన్ ఎత్తేశారు… మూల్యం తప్పదు: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేయడంలో పలు దేశాలు తొందరపడ్డాయని, దీనికి ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర కార్యాచరణ విభాగాధిపతి మైక్ రయన్ హెచ్చరించారు.
పలు దేశాలు కరోనా ఆంక్షలు ఎత్తేసి పరిస్థితులను సాధారణ స్థితికి తేవడంతో చాలా తొందరపడ్డారు. దీనికి త్వరలో మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్, అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు సడలించాయని గుర్తు చేశారు. ఇదే తీరు కొనసాగితే కొత్త వైరస్ లతో పాటు కొత్త వేవ్ లు వస్తాయన్నారు. అందరూ సంక్షోభం సమసిపోయిందని అనుకుంటున్నారని, యూరప్ లో ఇప్పటికీ సగటున వారానికి మిలియన్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. అమెరికా దేశంలోనూ ఇదే పరిస్థితి ఉందని మైక్ వెల్లడించారు.