డెల్టా వేరియంట్ తో ప్రమాదమే: డబ్ల్యూహెచ్ఒ
జెనివా: డెల్టా వేరియంట్ కొత్త మ్యుటేషన్ల కారణంగా ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. 98 దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తున్నదని, బెడ్లు దొరక్క రోగులను తిప్పి పంపిస్తున్న ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యధిక కేసులకు కారణమయ్యే డామినెంట్ వేరియంట్ గా మారిందని, వేగంగా వ్యాప్తి చెందడం మూలంగా పరిస్థితి మరింతగా దిగజారుతోందన్నారు. కరోనా సంక్షోభానికి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నామన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా ఇప్పటికీ పరిణామం చెందుతోందన్నారు. ఇది అత్యంత ప్రమాదకారి అని ఆయన అభివర్ణించారు. డెల్టా వేరియంట్ పై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని ఆయన హెచ్చరించారు. తమ వ్యూహాల్లో, అమలులో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని టెడ్రోస్ అథనామ్ ప్రపంచ దేశాలను కోరారు.