బయటకొస్తే… మాడి మసైపోతారు!: యుఎస్ వార్నింగ్

వాషింగ్టన్: అమెరికాలో ఏదొచ్చిన ఉపద్రవమే. వరదలు వచ్చినా, అడవులు కార్చిచ్చులా కాలిపోతున్నా ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటారు. పశ్చిమ అమెరికావాసులు ఎండల ధాటికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.

పోర్ట్ ల్యాండ్, ఒరేగాన్, సియాటిల్, సలేమ్ నగరాల్లో ఎండలు భగభగమండుతున్నాయి. 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఎండలు ప్రజలను బయట తిరగనివ్వడం లేదు. ఈ ఎండలను ఎదుర్కోవడానికి ప్రజలను ఇప్పటినుంచే సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి, ఆఫీసుల నుంచి బయటకు రావద్దని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసు హెచ్చరికలు జారీ చేసింది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది వాషింగ్టన్, ఒరేగాన్ లో ఎండల ధాటికి 12 మందికి పైగా ప్రాణాలు కోల్పయారు. కాలిఫోర్నియా-ఒరేగాన్ బార్డర్ లో కార్చిచ్చులు ఏర్పడి 600 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది.

ఇదిలా ఉంటే కెనడాలో ఇంత కన్నా ఘోరంగా ఉంది. బ్రిటీష్ కొలంబియాలో రికార్డు స్థాయిలో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాడ్పులు తట్టుకోలేక వెన్ కౌర్ ప్రాంతంలో 200 మందికి పైగా చనిపోయారు. 84 సంవత్సరాల తరువాత రికార్డు స్థాయిలో కెనడాలో ఎండలు నమోదు అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.