వాకర్ పై రాళ్లతో దాడి
విశాఖపట్నం: గుర్తు తెలియని వ్యక్తులు వాకర్ పై రాళ్లతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన మధురవాడ మిథిలాపురి కాలనీలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.
ఇవాళ ఉదయమే మిథిలాపూరి వుడా కాలనీ ఎన్.జి.ఓఎస్ లే అవుట్లో వాకింగ్ కు బయలుదేరిన సతీష్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల తో దాడి చేసారు.
దీంతో సతీష్ తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మిగతా వాకర్లు అప్రమత్తమై పోలీసులకు ఫోన చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.