పవన్ తో నేనెందుకు సినిమా చేస్తా: విజయేంద్ర
జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాల్లో నటిస్తూ, అటు రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆయన నటించిన వకీల్ సాబ్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నది.
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక కథను పవన్ కళ్యాణ్ కు వివరించగా ఒకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ వార్తపై ఆయన స్పందించారు. పవన్ కు కథ రాసేందుకు నేను సిద్ధంగానే ఉన్నానని, అయితే తనను ఎవరూ సంప్రదించలేదని, అలాంటప్పుడు నేనెందుకు రాస్తానని ప్రశ్నించారు. ఈ వార్తలో నిజం లేదని విజయేంద్రప్రసాద్ కొట్టిపారేశారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్ పై ఉండగా, మరో రెండు సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి.