ఇద్దరు పిల్లలుంటేనే సంక్షేమ పథకాలు?
లక్నో: ఎన్నికలు మరి కొద్ది నెలల ముందస్తు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. జనాభా నియంత్రణ ప్రోత్సహించేందుకు బిల్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ చట్టం-2021 తొలి ముసాయిదా సిద్ధం చేశారు. ఈ నెల 11న ఈ ముసాయిదాను ప్రజల ముందు పెట్టనున్నారు. బిల్లు చట్టరూపంలో వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు మంజూరు చేస్తారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే ఉద్యోగాలు రావు, సంక్షేమ పథకాలు అందవు. ఈ ముసాయిదాపై పది రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియచేయాల్సి ఉంటుంది. జూలై 19వ తేదీని చివరి గడువుగా లా కమిషన్ నిర్ధేశించనున్నది. కొన్ని వర్గాలు ఇప్పటికి జనాభా నియంత్రణ పాటించడం లేదని, పేదరికం, నిరక్షరాస్యతకు ఇదే కారణమని సిఎం యోగి ట్వీట్ చేశారు.