ఒకే మహిళకు రెండు వేరియంట్ల వైరస్

దిస్ పూర్: కరోనా మహమ్మారి ఎ గడియలో ఎక్కడ మొదలైందో తెలియదు కాని ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఒక వేరియంట్ వైరస్ సోకితేనే అల్లాడిపోతుండగా, ఒక మహిళా డాక్టర్ కు రెండు వేరియంట్లు సోకాయి.

విచిత్రమేమంటే ఆమె ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా వేయించుకున్నా రక్షణ లభించలేదు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లా లాహోవాల్ ఐసిఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చి సెంటర్ నోడల్ ఆపీసర్ బిశ్వాజ్యోతి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఒక వైద్యురాలికి ఆల్ఫా, డెల్టా వేరియంట్ వైరస్ లు సోకాయన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నది. అనుమానం కలిగి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది. ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్నది. ఆమె నమూనాలను ఐసిఎంఆర్ పరీక్షించిన సమయంలో రెండు వేరియంట్లు సోకినట్లు వెలుగు చూసింది. ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకింది. డబుల్ వేరియంట్ సోకిందా అనేది మరోసారి నిర్థారణ చేసుకునేందుకు రెండోసారి నమూనాలు తీసుకున్నట్లు ఐసిఎంఆర్ నోడల్ ఆఫీసర్ బిశ్వాజ్యోతి తెలిపారు. తమ సెంటర్ లో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.