రెండు తలల పాము ముఠా అరెస్టు
గుంటూరు: రెండు తలల పాము విక్రయించే ముఠా ను జిల్లా అటవీ శాఖ, క్రైమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాములను అన్ లైన్ లో విక్రయిస్తున్న సమాచారం రావడంతో అటవీ శాఖ రంగంలోకి దిగింది.
పాములను విక్రయించడానికి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు తలల పాముల విలువ రూ.50లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఔ0షదాల తయారీకి రెండు తలల పాములు ఉపయోగిస్తారని అధికారుల వెల్లడించారు. ఇందుకోసం జిల్లాలో కొన్ని ముఠాలు తిరుగుతున్నాయని, వారిని పట్టుకుని కేసులు పెడతామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.