రూమర్స్ నమ్మొద్దు: టక్ జగదీశ్
సినిమా హాళ్లు మూసివేయడంతో ఈ మధ్య ఒటిటి ఫ్లాట్ ఫామ్ లో రిలీజు చేసేందుకు నిర్మాత, దర్శకులు సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు కూడా ఒటిటిలో రిలీజు అయ్యాయి.
విరాటపర్వం తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, టక్ జగదీశ్ వంటి చిత్రాలు కూడా ఇదే ఫ్లాట్ ఫామ్ రిలీజు అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాలపై టక్ జగదీశ్ టీమ్ స్పందించింది. రూమర్స్ నమ్మొద్దని, మాతో కనెక్ట్ అయి ఉండండని ప్రకటించింది. త్వరలోనే బాక్సాఫీసు ను టక్ చేయబోతున్నామని నిర్మాణ సంస్థ పోస్టు చిసంది. షైస్ స్క్రీన్స్ బ్యానర్ పై గారపాటి సాహు, పెద్ది హరీశ్ నిర్మిస్తున్న దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో నాని తో పాటు ఐశ్వర్య రాజేశ్, రీతూ వర్మ, నరేష్, జగపతి బాబు, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తుండగా శివ దర్శకత్వం వహిస్తున్నాడు.