మీకు… మీ పార్టీకో దండం: రమణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎల్.రమణ గుడ్ బై చెప్పారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను.
అందుకోసమే తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుకు లేఖ పంపించారు. గత మూడు దశాబ్ధాలుగా నా ఎదుగుదలకు తోడ్పాటునందించి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రమణ తన లేఖ లో తెలిపారు. గత నెల రోజులుగా రమణ టిఆర్ఎస్ లో చేరుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. గురువారం రాత్రి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో రమణ కలిసి సిఎం కెసిఆర్ ను ప్రగతి భవన్ కు వెళ్లి చర్చించిన విషయం తెలిసిందే.