తిరుపతి హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిన్నటి రోజు సోమవారం 17,073 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 8,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 1.70 కోట్లు. భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేసింది. జులై 20న మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి సోమవారం నాడు తెలిపింది. ఆ విధంగానే ఇవాళ రోజుకు 5 వేల చొప్పున జూలై నెల కోటా టికెట్లను విడుదల చేసింది. దర్శనం టికెట్లను టిటిడి వెబ్ ఫోర్టల్ లో అందుబాటులో పెట్టింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది. దర్శన సమయంలో కచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని భక్తులకు టిటిడి వినతి చేసింది.