4 రోబోలు నిర్మించిన త్రీ డి స్టీల్ బ్రిడ్జి

అమెస్టర్ డమ్: ప్రపంచోం మొట్ట మొదటి త్రీ డి ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జి అమెస్టర్ డమ్ లో నిర్మించారు. అది కూడా నాలుగు రోబోలతో పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
అతి పురాతన కాలువపై నిర్మించిన బ్రిడ్జి కోసం 4,500 కిలోల స్టీల్ ను ఉపయోగించారు. నెదర్లాండ్ కు చెందిన ఎంఎక్స్ త్రీడి కంపెనీ దీనిని జూలై 15న ప్రారంభించి జూలై 18న ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాహ్ అనిపించింది.

సుమారు 12 మీటర్ పొడవైన ఈ బ్రిడ్జిని నాలుగు రోబోలు కలిసి తయారు చేయడం మరో విశేషం. ఆరు నెలల పాటు శ్రమించి తయారు చేసిన బ్రిడ్జిని మూడు రోజుల వ్యవధిలో అమర్చారు. కాలు వద్దకు పెద్ద పడవలో తీసుకువచ్చారు. కంప్యూటర్ ప్రింటర్ లో త్రీ డి ప్రింటింగ్ కు ఇంక్ తో పాటు పేపర్ అవసరం కాని అదే త్రీ డి ప్రింటర్ లో మనం సృష్టించే వస్తువుల సైజ్, కలర్, డిజైన్ ను కూడా నిర్ణయించి తయారు చేసుకోవచ్చు. కొలతలు, డిజైన్ సెట్ చేసుకున్న తరువాత మిషన్ కు పంపిస్తే, ఆ పనిని రోబోలు చేపట్టి పూర్తి చేస్తాయి.

Leave A Reply

Your email address will not be published.