రామ్ సినిమాలో యువ విలన్

నటుడు రాము ద్వి భాషా చిత్రంలో విలన్ గా నటించేందుకు యువ విలన్ అంగీకరించాడని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత మంచి స్పీడ్ లో ఉన్న రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి తో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. తాజా షెడ్యూల్స్ హైదరాబాద్, విశాఖలో ప్లాన్ చేయగా, ఉప్పెన బ్యూటీ కృతిషెట్టి నటిస్తున్నది. ఈ చిత్రంలో యువ విలన్ ఎవరిని తీసుకోవాలనే దానిపై చర్చలు జరిగాయి. తొలుత నటుడు మాధవన్ ను తీసుకోవాలని అనుకోగా, ఆయన కాదని స్వయంగా దర్శకుడు లింగుస్వామి స్పష్టం చేశారు. తమిళ నటుడు ఆర్య నటిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా పినిశెట్టి ఆది నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఆది పలు చిత్రాలలో ప్రధాన పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఆయన షెడ్యూలు సర్ధుబాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చర్చించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.