మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ;గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణారెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, దీంతో పలు చోట్ల నీటి ప్రవాహం ఎక్కవైందని, రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ప్రవహిస్తుందని ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణారెడ్డి గారు అన్నారు. పలు చెరువులు, కుంటలు నిండిపోయాయని, పలు చోట్ల చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. పలు గ్రామాలకు రాకపోకలు కూడా ఇబ్బందిగా మారాయని, వాహన దారులు జాగ్రత్త వహించాలన్నారు. కల్వర్టులలో భారిగా వరద నీరు ప్రవహిస్తుందని, ఎవరు కూడా వరదనీటిలోకి వెళ్లెందుకు సహాసం చేయవద్దన్నారు. గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారి ఆదేశాల మేరకు మండల అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. గౌరవ తహాసీల్దార్, గౌరవ ఎంపిడిఓ, గౌరవ ఏఈ , గౌరవ ఎస్ఐ గారులతో, సంభందిత సర్పంచ్, ఎంపిటిసిలతో మాట్లాడి ప్రజలకు , రైతులకు ఇబ్బంది కలగుండా చూడాలని చెప్పడం జరిగిందన్నారు.