కాంగ్రెస్ లో టిజెఎస్ విలీనం?

హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ కాంగ్రెస్ లో విలీనం పై చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే.
ఈ విషయంపై గతంలోనే కోదండరామ్ తో రేవంత్ చర్చలు జరిపారు.

రేవంత్ సూచనతోనే గతంలో కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించడానికి కొండా విశ్వేశ్వర రెడ్డి తో కలిసి ఈటల వద్దకు కోదండరామ్ వెళ్ళారు కూడా. రేవంత్ అధ్యక్షుడు అయితేనే విలీనం లేదా పొత్తు పై ఆలోచన చేద్దామని గతంలో తన పార్టీ సహచరులతో కోదండరామ్ చెప్పినట్లు సమాచారం. పార్టీ అధిష్టానంతో చర్చించి, రేవంత్ నిర్ణయం తీసుకున్న తర్వాత తదుపరి చర్చలు ఉండే అవకాశం ఉంది. గతంలో పార్టీ వీడిన వారిని కూడా రేవంత్ తిరిగి చేర్చుకునేందుకు మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.