కేసీఆర్ తో టీడీపీ అధ్యక్షుడు రమణ భేటీ?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ టిఆర్ఎస్ లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ప్రగతి భవన్ వెళ్లి సిఎం కెసిఆర్ తో సమావేశం కానున్నారు.
ఇద్దరి సమావేశం తరువాత పార్టీ లో ఎప్పుడు చేరతారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో రమణతో గత నెల పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయి చర్చించారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇద్దరి మధ్య చేరికపై చర్చలు జరిగి, ఒక నిర్ణయానికి వచ్చారు.