లోకల్… నాన్ లోకల్ పట్టించుకోను: బాలకృష్ణ
మువీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలపై హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.
గతంలో మా ఫండ్ రైజింగ్ చేస్తున్నామంటూ విమానాల్లో చక్కర్లు కొట్టారు. ఆ డబ్బులు ఏం చేశారు, ఎక్కడికి పోయాయని బాలకృష్ణ ప్రశ్నించారు. అసోసియేషన్ కు ఇంత వరకు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని ఆయన లేవనెత్తారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరా భూమిని కూడా సాధించలేకపోయారా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరం కలిస్తే మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని బహిరంగంగా మాట్లాడుకోవద్దని బాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.