కొడుకు కేంద్ర మంత్రి… అయినా కూలీకె వెళ్తాం!

చెన్నై: కుమారుడు ఎంపి అయ్యాడు. తాజగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మంత్రి కూడా అయ్యాడు. అయినా తల్లిదండ్రులు మొదటి నుంచి నమ్ముకున్న కూలీ పనులు చేయడానికే ఇష్టపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి మంత్రి వర్గ విస్తరణలో ఎల్.మురుగన్ ను పదవి వరించింది. ఆయన స్వగ్రామం తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి దగ్గరలో ఉన్న కోనూరు. లోకనాథన్ (65), వరదామ్మల్ (60) దంపతుల కుమారుడు. కూలీ పనులు చేస్తునే పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు.

లా లో పోస్టు గ్యాడ్యుయేషన్, పి.హెచ్.డి చేసిన మురుగన్ తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు తల్లిదండ్రులను సంప్రదించింది. మీ కొడుకు కేంద్ర మంత్రి కదా, ఇంకా పనిచేస్తున్నారా అని అడిగింది. మా కుమారుడు ఇంటికి రావాలని పిలిచాడు. కాని మా సొంతూరులో రెక్కలు బాగున్నంత వరకు కష్టపడి పనిచేసి బతకాలని నిర్ణయించుకున్నాం. శక్తి ఉన్నంత వరకు కష్టం చేసి బతుకుతామన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, కుమారుడు బాగుండాలని తల్లిదండ్రులు ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.