హైకోర్టు జడ్జీలపై దూషణలు… 3 నెలల గడువు కోరిన సిబిఐ

అమరావతి: సోషల్ మీడియాలో ఏపి హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలు, వీడియోలపై ఇఫ్పటికే మూడుసార్లు స్టేటస్ రిపోర్టు ఇచ్చామని సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
పూర్తి విచారణకు 3 నెలలు పడుతుందని సిబిఐ తరఫు న్యాయవాది విన్నవించారు.

మరింత గడువు కావాలని కోరడంతో విచారణను 3 నెలలకు వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. వైసిపి కి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులను విశాఖపట్నంలోని సిబిఐ కార్యాలయానికి పిలిపించి అధికారులు విచారించారు. వీరి నుంచి స్టేట్ మెంట్లు కూడా తీసుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.