కరువు కోరల్లో ఇథియోపియా

టైగ్రే: ఇథియోపియాలో తీవ్ర కరువు ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా దేశంలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇథియోపియా ప్రభుత్వ దళాలు, టైగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో దేశం అట్టుడుకుతున్నది.
టైగ్రే ప్రాంతంలో సుమారు నాలుగు లక్షల మంది పౌరులు తిండి లేక అల్లాడుతున్నారు.

వీరిని ఆదుకునేందుకు ముందుకు రావాలని ఐక్య రాజ్య సమితి (యుఎన్ఒ) పిలుపునిచ్చింది. టైగ్రే ప్రాంతంలో 33వేల మంది చిన్నారులు పోషకాహారంతో సతమతమవుతున్నారని తెలిపింది. మరో 18 లక్షల మంది కరువులోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు యుఎన్ఒ హెచ్చరించింది కూడా.

Leave A Reply

Your email address will not be published.