బుల్లితెరపై మాస్టర్ చెఫ్ గా సేతుపతి
త్వరలో టివి ప్రేక్షకుల ముందుకు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి రాబోతున్నారు. తమిళ అభిమానుల్లో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి పాత్రనైనా లీనమైపోయి నటించి మెప్పిస్తాడు.
ఇప్పటి వరకు సినిమాల్లో ఆయన నటనను చూశాం. ఇకనుంచి టివి లో కూడా చూడవచ్చు. తమిళంలో విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించబోతున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది. ప్రోగ్రామ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా సేతుపతి తన గురించి ఎవరికీ తెలియని విషయాలు వెల్లడించారు. చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ వెళ్లి వచ్చిన తరువాత అర్థరాత్రి వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసేవాడు. రాత్రిపూట అక్కడే భోజనం చేసి రూమ్ కు వచ్చేవాడు. ప్రతి నెలా రూ.750 జీతం వచ్చేదని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు టెలిఫోన్ బూత్ లో పనిచేశానన్నారు. ఖాళీ సమయం దొరికితే ఇంట్లో ఉల్లిపాయలతో సమోసా చేసుకుని తింటూ, టీ తాగుతానని సేతుపతి చెప్పాడు.