సరయు నదిలో 15 మంది జల సమాధి

లక్నో: సరయు నదిలో స్నానానికి వెళ్లిన 15 మంది జల సమాధి అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లిన 15 మంది మునిగిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదం ఏర్పడింది.

ఒకే కుటుంబానికి చెందిన వీరు స్నానం కోసం నదిలో దిగారు. వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా మునిగి ఊపిరి ఆడక చనిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు నదీ తీరం ప్రాంతానికి చేరుకున్నారు. బాధితులను ఆదుకునేందుకు ఘటనా ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సిఎం యోగి ఆదిత్యనాథ్ జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక అందచేయాలని అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.