55 రోజులు… మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా 45,892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో కోలుకున్న వారికన్నా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 55 రోజుల తరువాత అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.

కరోనా పాజిటివ్ వ్యాధి తగ్గినట్టే తగ్గి కేసులు, మరణాలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే 5 శాతం పెరుగుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,892 మందికి పాజిటివ్ సోకింది. తాజా కేసులతో కలిపితే మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. నిన్న 817 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,05,028 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.50శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.18 శాతానికి పెరిగింది. 4.6లక్షల మంది కరోనా తో బాధపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.