వారం క్రితమే రిషభ్ పంత్ కు పాజిటివ్

లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లి సేనకు గట్టి షాక్ తగిలింది. వికెట్ కీపర్, యువ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ కు కరోనా వైరస్ నిర్థారణ అయ్యిందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి.

కరోనా వైరస్ సోకినట్లు రిపోర్టులు రావడంతో రిషభ్ ను టీమ్ సభ్యుల నుంచి దూరంగా ప్రత్యేక గదిలో పెట్టారు. రిషభ్ కు పాజిటివ్ నిర్థారణ అయి వారం రోజులు దాటినట్లు తెలిసింది. ఈ నెల 18న (పదో రోజు) మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు జరిగే పరీక్షలో నెగెటివ్ వస్తే రిషభ్ ను తిరిగి జట్టుకలోకి తీసుకోనున్నారు. ఇంగ్లండ్ టెస్టు సీరిస్ కు ముందు 40 రోజుల వ్యవధి మిగిలి ఉండడంతో క్రీడాకారులు రెస్టు తీసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.