రాంకీ అయోధ్య లెక్కలు తేల్చిన ఐటి

హైదరాబాద్: వైసిపి ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్న రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టిందని ఆదాయపు పన్ను (ఐటి) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

రూ.1200 కోట్లు కృత్రిమ నష్టాలను రాంకీ చూపించి, రాంకీలో మేజర్ వాటాను సింగపూర్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారని వెల్లడించింది. తప్పుడు లెక్కలు చూపెట్టి రూ.300 కోట్లు పన్ను ఎగ్గొట్టేందుకు సంస్థ యత్నించింది. రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసిందని పేర్కొంది. రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు లు చేపట్టింది. లెక్కలోకి రాని రూ.300 కోట్ల నగదు లావాదేవీలను గుర్తించామని ఐటి విభాగం ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.