రాజధాని ఎక్స్ ప్రెస్ లు సూపర్

న్యూఢిల్లీ: అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ టెక్నాలజీతో రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆధునీకరిస్తున్నారు. తేజస్ తరహా స్మార్ట్ కోచులతో ఇండియన్ రైల్వే తయారు చేస్తున్నది.
కొత్త కోచులతో తయారు చేసిన రాజధాని ఎక్స్ ప్రెస్ సోమవారం నాడు ముంబై-ఢిల్లీ మధ్య ప్రయాణించి ఆకట్టుకున్నది. ‘

ప్రతి కోచులో సిసిటిటి కెమెరాలను రాత్రిపూట పనిచేసేలా అమర్చారు. 24 గంటలూ రికార్డు చేస్తుంది. సీట్లు మంటలకు అంటుకోని విధంగా తయారు చేశారు. ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ కల్పించారు. పై బెర్త్ కు వెళ్లడానికి కొత్త మెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి కోచు డోర్లు ఆటోమెటిక్ గా తెరుచుకుని, మూసుకుంటాయి. స్టేషన్ లో రైలు కదిలే వరకు డోర్లు మూసుకోవు మరి.

Leave A Reply

Your email address will not be published.