సింధూ నీతో ఐస్ క్రీమ్ తింటా: మోదీ
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధూతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మీటింగ్ అయ్యారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
ఒలింపిక్స్ ముగియగానే నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటానని మోదీ చెప్పగా సింధూ నవ్వేసింది. డైటింగ్ లో భాగంగా ఐస్ క్రీమ్ తినడం మానేసానని చెప్పడంతో మోదీ ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ కలిసి తింటానని మోదీ హామీ ఇచ్చారు.