కొత్త మంత్రులు… క్యాబినెట్ తో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం మంత్రివర్గ సభ్యులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా, ప్రధాన కార్యదర్శి (సంస్థ) బిఎల్.సంతోష్ హాజరు కానున్నారు.
పునర్ వ్యవస్థీకరణలో మొత్తం 18 మందికి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి వారికి ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖలకు కూడా మంత్రులను నియమించాల్సి ఉంది. ప్రధాని నివాసంలో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపించారు. ఈ సమావేశంలో ఎవరెవరిని ఇంటికి పంపిస్తున్నారనే దానిపై ప్రధాని వారికి తెలియచేయనున్నారు. కనీసం పది మంది మంత్రులకు ఉద్వాసన జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణ నుంచి ఎవరినీ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదు.