ప్రగతి భవన్ పన్ను బకాయిలు రూ.25 లక్షలు

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ క్యాంపు కార్యాలయం బకాయిలు రూ.17.06 లక్షలు కాదని రూ.25.49 లక్షలు అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) తేల్చింది.

పన్ను మదింపులో జరిగిన పొరపాటును సరిచేయడంతో బకాయి మొత్తం పెరిగినట్లు జిహెచ్ఎంసి ఖైరతాబాద్ సర్కిల్ వర్గాలు తెలిపాయి. బేగంపేటలోని ఇంటి నెంబర్ 6-3-870/ఏ లో కెసిఆర్ అధికారిక బంగ్లా ఉంది. బంగ్లా విస్తీర్ణం మొత్తం 1.69 లక్షల చదరపు అడుగులు కాగా 2018-19 సంవత్సరంలో మదింపు చేశారు. తాజా లెక్కల ప్రకారం 2020-21 వరకు ఆస్తి పన్ను రూ.15.12 లక్షలు కాగా వడ్డీ రూ.5.09 లక్షలు కలిపి రూ.20.21 లక్షలు అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుతో కలిపితే బకాయి రూ.25.49 లక్షలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు పన్ను బకాయిలు చెల్లించలేదు.

Leave A Reply

Your email address will not be published.