40వేలకు దిగువన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో 38,164 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకు ముందు రోజు తో పోల్చితే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి 499 మంది చనిపోయారు.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు చేరుకోగా, మరణాల సంఖ్య 4.14 లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళలో అత్యధికంగా 13,956 కేసులు రాగా మహారాష్ట్ర లో 9వేల కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు దేశంలో 40.64 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.