తెలంగాణలో నేడే పాలిసెట్
హైదరాబాద్: తెలంగాణ విద్యా శాఖ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం పాలిసెట్ – 2021 పరీక్ష ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి కారణంగా ఈ పరీక్ష ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు.
శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్న పరీక్షకు 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 411 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల తరువాత ఒక్క విద్యార్థిని అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాన్ని ఎస్.బి.టి.ఈ.టి యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. కరోనా పాజిటివ్ విద్యార్థులకు సమీపంలోని ఆసుపత్రులలో పరీక్ష నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పాలిసెట్ నిర్వాహకులు తెలిపారు.