ప్లాస్టిక్ కోడిగుడ్లు.. జనం ఆశ్చర్యం!
నెల్లూరు: ఆ మధ్య ప్లాస్టిక్ బియ్యం, కోడిగుడ్ల గురించి విన్నాం. మళ్లీ నెల్లూరు జిల్లాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్ల కలకలం మొదలైంది. వరికుంటపాడు మండలం ఆండ్రవారి పల్లెలో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు అమ్మడంతో పలువురు ఎగబడి కొనుగోలు చేశారు.
తీసుకువెళ్లిన తరువాత ఇంట్లో ఉడకబెడితే ఉడకడం లేదని, అనుమానం వచ్చి కొందరు నేలకు కొట్టగా రబ్బర్ బంతి మాదిరి ఎగురుతోంది. గుడ్లు కావు అవి ప్లాస్టిక్ బంతులు అని నిర్థారణకు వచ్చారు. గుడ్ల లోపల తెలుగు, పసుపు రంగు బదులు నారింజ రంగులో ఉండడంతో నకిలీవేనని తేల్చారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని కొనుగోలు చేసి మోసపోయామని గ్రామస్థులు వాపోయారు.