ఇండోనేషియాలో ఆక్సిజన్ కొరత
జకర్తా: ఇండోనేషియా దేశం ఆక్సిజన్ కొరతతో తీవ్ర సతమతమవుతున్నది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు దేశంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. తమ దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, సాయం చేయాలంటూ పొరుగు దేశాలను అభ్యర్థిస్తోంది.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్న సమయంలో ఇండోనేషియా వేలకొద్దీ ఆక్సిజన్ ట్యాంకులను పంపించింది. తాము వినియోగించగా మిగిలిన ఆక్సిజన్ మొత్తాన్ని ఇండియాకే తరలించింది. డెల్టా వేరియంట్లతో ఇప్పుడు ఇండోనేషియా దేశం గడగడలాడుతోంది. సాయం చేయాలంటూ ఇండియా, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా దేశాలను వేడుకుంటున్నది. సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ ట్రేటర్లు, వెంటిలేటర్లు, వైద్య పరికరాలు సాయం చేశాయి. ప్రతిరోజు 39వేలకు పైగా డెల్టా వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి. వీరిలో 70 శాతం మందికి ఆక్సిజన్ అవసరం ఉండడంతో సమస్యగా పరిణమించింది.