నామినేటెడ్ లో మహిళలకు పెద్దపీట: సజ్జల
విజయవాడ: రాష్ట్రంలో పలువురు వైసిపి నాయకులకు నామినేటెడ్ పదవులు వరించాయి. నామినేటెడ్ పదవులు ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణా రెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపి నందిగాం సురేష్ ప్రకటించారు.
ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, 135 సంస్థలు, కార్పొరేషన్ లకు నియమాకాలు చేశామన్నారు. ఇందులో మహిళలకు 68 మందికి పదవులు ఇస్తున్నామన్నారు. 50 శాతం మహిళలకు పదవులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అన్నారు. 76 పదవులు ఎస్సి, ఎస్టీ, మైనారిటీల కు, 56 ఓసీలకు, 67 పురుషులకు ఇవ్వడం జరిగిందన్నారు. 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సామాజిక, ఆర్థిక, మహిళల సంక్షేమం పరంగా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పదవులు అలంకారం కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం లో వారి పాత్ర వుంటుందన్నారు. పదేళ్లుగా పార్టీ పెట్టాక క్రియాశీలకంగా అనేకమంది కార్యకర్తలు సిఎం జగన్మోహన్ రెడ్డి ముందు నడిచారు. అందులో కొందరికి ఆ పదవుల బాధ్యతలు ఇప్పుడు ఇచ్చామని, తరువాత మరికొందరికి పదవులు వస్తాయన్నారు.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ దేశ చరిత్రలో 56 బిసి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారికి గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. బిసిల అందరూ జగన్మోహన్ రెడ్డికి నాయకత్వానికి అండగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో బిసిలకు అధికశాతంలో పదవులు దక్కుతున్నాయి. రాజ్యసభ సభ్యులు, నామినేటడ్ పదవులు ఎంపికలో జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.