దేశంలో కొత్తగా 38,949 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 38,949 పాజిటివ్ కేసులు నమోదు కాగా 542 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో పాజిటివ్ కేసులు 3,10,26,829 కు చేరుకోగా, 3,01,83,876 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,30,422 ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 40,026 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 3,12,531 మంది కరోనాతో చనిపోయారు.