గాంధీ భవన్ లో రేవంత్ మార్క్ వాస్తు

హైదరాబాద్: నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించే లోపు వాస్తు ప్రకారం మార్పులు చేయాలని నూతన అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఆ మేరకు గాంధీ భవన్ లో మార్పులు జరుగుతున్నాయి. క్యాంటిన్ వైపు నుంచి ప్రధాన ద్వారం ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ జెండాలు విక్రయించే గది, సెక్యూరిటీ గదిని తొలగిస్తున్నారు. తూర్పు, ఈశాన్యం వైపు ఎలాంటి బరువు లేకుండా చూస్తున్నారు. ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ లోపే పనులు పూర్తి కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.