కన్న కూతురినే చెట్టుకు వేలాడదీశారు

భోపాల్: అమ్మాయి కి వివాహం జరిగితే ఆమె ఉండాల్సింది అత్తారింటి వద్దే. అలా కాకుండా పారిపోయి తల్లిగారి ఇంటికి వచ్చిన కూతురు పట్ల తల్లిదండ్రులు అమానుషంగా వ్యవహరించారు.

పుట్టింటివారు ఆమెను చెట్టుకు వేలాడదీసి దారుణంగా హింసించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడేపూల్ తలావ్ గ్రామానికి చెందిన మహిళ సమీప గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్నది. పెళ్లైన తరువాత ఉపాధి నిమిత్తం భర్త గుజరాత్ రాష్ట్రం వెళ్లాడు. భర్త వ్యవహారం పై విసుగు చెందిన భార్య చెప్పా పెట్టకుండా తల్లిగారింటికి వచ్చింది. అక్కడి నుంచి పారిపోయి వచ్చిందనే కోపంతో తల్లిదండ్రులకు ఆమెకు కఠిన శిక్ష విధించారు. తండ్రి, సోదరులు ఆమెను దారుణంగా కొట్టి, చెట్టుకు వేలాడదీశారు. మరోసారి ఇలా చేయవద్దని తీవ్రంగా హింసించారు. ఒక వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియో పోలీసుల వద్దకు చేరడంతో వారు గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులు, సోదరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.