ఐపిఎస్ ప్రవీణ్ కు నా మద్దతు: ఏపి సిఐడి చీఫ్
అమరావతి: ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సోదరుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఏపి సిఐడి చీఫ్ పివి.సునీల్ కుమార్ తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నా వద్ద బెల్లంపల్లిలో ఏఎస్పిగా ఉద్యోగ ప్రస్తానం మొదలు పెట్టాడు.
ప్రవీణ్ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, ఆయన నిర్ణయాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఎప్పటికీ తన నైతిక మద్దతు ఉంటుందని శుభాకాంక్షలు తెలిపారు. పదవి కేవలం ఒక పనిముట్టు మాత్రమేనని, జీవితం అంటే పదవి కాదన్నారు. నమ్మని సిద్ధాంతం కోసం మనం నిర్ధేశించుకున్న లక్ష్యం మాత్రమేనని సునీల్ స్పష్టం చేశారు.