సైబర్ క్రైమ్ స్టేషన్ లో మోహన్ బాబు ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో సినిమా నటుల డైలాగ్స్ వాడడం ఎప్పటినుంచో మొదలైంది. మొదట్లో ఇది బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త తలనొప్పులు తెస్తున్నది. తమ సంబంధీకుల పైనే డైలాగ్ లను వాడడంతో లేని సమస్యలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో తన డైలాగ్ లను, వీడియోలను వ్యక్తిగత దూషణలను వినియోగిస్తున్నారని నటుడు మోహన్ బాబు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పదాలు, బూతులు ఉపయోగించి వీడియోలను పోస్టు చేస్తున్నారని వాపోయారు. మోహన్ తరఫున ఆయన న్యాయవాది సంజయ్ పోలీసులకు ఫిర్యాదు అందచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.